Loading...
IRCTC Tour Package: సికింద్రాబాద్‌ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌.. 10 రోజుల ఆధ్యాత్మిక యాత్ర వివరాలివే!
సికింద్రాబాద్‌ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌.. 10 రోజుల ఆధ్యాత్మిక యాత్ర వివరాలివే!

IRCTC Tour Package: సికింద్రాబాద్‌ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌.. 10 రోజుల ఆధ్యాత్మిక యాత్ర వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ (IRCTC) పర్యాటకులు, భక్తుల కోసం మరో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'వారణాసి-అయోధ్య పుణ్యక్షేత్ర యాత్ర' పేరుతో భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైలు 2026 డిసెంబర్ 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనుంది.

వివరాలు

9 రాత్రులు.. 10 రోజుల యాత్ర

ఈ ఆధ్యాత్మిక యాత్ర మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు కొనసాగనుంది. ప్రయాణికుల కోసం రైలులో మొత్తం 705 సీట్లను కేటాయించారు. ఇందులో స్లీపర్ క్లాస్ (ఎకానమీ)లో 237 సీట్లు, థర్డ్ ఏసీ (3AC)లో 416 సీట్లు, సెకండ్ ఏసీ (2AC)లో 52 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బోర్డింగ్, డీబోర్డింగ్ సదుపాయం

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యంగా పలు కీలక రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కేందుకు, దిగేందుకు ఐఆర్‌సీటీసీ ఏర్పాట్లు చేసింది.

సికింద్రాబాద్‌తో పాటు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో బోర్డింగ్, డీబోర్డింగ్ సదుపాయం కల్పించింది.

వివరాలు

యాత్రలో దర్శించుకునే పుణ్యక్షేత్రాలు

ఈ యాత్రలో భాగంగా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించారు.

పూరి: జగన్నాథ స్వామి దర్శనం, ప్రత్యేక పూజలు, కోణార్క్ సూర్య దేవాలయ సందర్శన.

బద్రీనాథ్ ధామ్: బద్రీనాథ్ స్వామి దర్శనం.

వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ అమ్మవార్ల దర్శనం, కాశీ కారిడార్ సందర్శనతో పాటు సాయంత్రం ప్రసిద్ధ గంగా హారతి వీక్షణం.

అయోధ్య: బలరామ్ మందిర్, హనుమాన్ గర్హి దర్శనం, సరయూ నది హారతి.

ప్రయాగ్‌రాజ్: త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం.

ఈ పుణ్యక్షేత్రాల సందర్శన పూర్తయిన అనంతరం రైలు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ADVERTISEMENT

వివరాలు

ప్యాకేజీ ధరలు ఇవే..

ఐఆర్‌సీటీసీ ఒక్కొక్క ప్రయాణికుడికి మూడు విభాగాల్లో ప్యాకేజీ ధరలను నిర్ణయించింది.

ఎకానమీ (స్లీపర్): పెద్దలకు రూ.17,000, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు రూ.15,800.

స్టాండర్డ్ (3AC): పెద్దలకు రూ.26,400, చిన్నారులకు రూ.25,000.

కంఫర్ట్ (2AC): పెద్దలకు రూ.34,400, చిన్నారులకు రూ.32,700.

ఈ ప్యాకేజీ ధరల్లో రైలు ప్రయాణ చార్జీలతో పాటు స్థానిక సందర్శన కోసం రోడ్డు రవాణా, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, భోజనం, ప్రయాణ బీమా సదుపాయాలు కూడా కలిపి ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.

ఈ యాత్రకు సంబంధించిన టికెట్ల బుకింగ్, ఇతర పూర్తి వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు.

ADVERTISEMENT