Bharat Summit 2.0: దావోస్ తరహాలో ప్రపంచ విధాన చర్చలకు భారత్ సమిట్ 2.0
ఈ వార్తాకథనం ఏంటి
దావోస్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా విధానపరమైన చర్చలు జరిపేందుకు 'భారత్ సమిట్ 2.0' వేదికగా నిలవనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఈ సమిట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సన్నద్ధతపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..దావోస్ తరహాలో అంతర్జాతీయ విధాన చర్చలకు భారత్ సమిట్ వేదిక కానుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ,అహింస,అలీన విధానం,మిశ్రమ ఆర్థిక విధానాలు ప్రపంచానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో భారత్ సమిట్ 2.0
రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.
భారత్ సమిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానిస్తే తప్పేముందని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
ఈ అంశంపై భాజపా నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు నేతలు వెల్లడించారు.
ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో భారత్ సమిట్ 2.0 నిర్వహించనున్నారు.