CANADA VISA: నేటి నుంచి కెనడాలో భారత వీసా సేవలు పున:ప్రారంభం.. ఏఏ కేటగిరీల్లో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం ప్రకటన చేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాదుల విషయంలో భారత్, కెనడా మధ్య తీవ్రమైన దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో కెనడా పౌరులకు భారత్ వీసా సేవలను నిలిపివేసింది.
ప్రస్తుతం వీసా సేవలను పునరుద్ధరిస్తూ ఒట్టావాలోని భారత హైకమిషన్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది.
అయితే వీటిల్లో కొన్ని కేటగిరీల్లో మాత్రమే ఈ సేవలను పునరుద్ధరిస్తున్నామని బుధవారం ప్రకటనలో వెల్లడైంది.
1. ఎంట్రీ వీసా
2. బిజినెస్ వీసా
3. మెడికల్ వీసా
4. కాన్ఫరెన్స్ వీసాల
ఈ నాలుగు వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్లు భారత హైకమిషన్ స్పష్టం చేసింది.
DETAILS
గతంలో భారతదేశంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు
ఈ క్రమంలోనే భద్రతా పరిస్థితులపై సమీక్ష చేసిన హై కమిషన్, అక్టోబర్ 26 నుంచి ఆయా కేటగిరీల్లో వీసా సర్వీసుల్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు వివరించింది.
తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇదే సమయంలో నిజ్జర్ హత్య కేసులో భారతదేశంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
అయితే కెనడాలోని భారత దౌత్యవేత్తపై ఆ దేశం బహిష్కరించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో కెనడా వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్, దేశంలో కెనడా రాయబారిని బహిష్కరించింది.
కెనడాలోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రవాస భారతీయులు, కెనడా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
తాజాగా భారత రాయబార కార్యాలయం తన సేవలను పున ప్రారంభించింది.