హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత
హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూశారు. 86ఏళ్ల వయస్సున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భాస్కరరావు పని చేసారు. జస్టిస్ భాస్కరరావు నల్గొండ జిల్లా చంతపల్లి మండలం ఘడియ గౌరారంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉప్పల్ ఈస్ట్ కళ్యాణపురిలో నివాసం ఉంటున్నారు. జస్టిస్ భాస్కరరావు 1937లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ చదివారు. 1963లో ఆయన న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అయితే 1981లో జస్టిస్ భాస్కరరావు జిల్లా సెషన్స్ జడ్జిగా నియామకమయ్యారు. 1995లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1997లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1999లో జస్టిస్ భాస్కరరావు పదవీ విరమణ చేశారు.