
Bhopal: భార్యకు ఉరి వేసి.. దగ్ధం చేసిన వ్యక్తి భోపాల్ లో అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం వుందనే అనుమానించాడు. దీనితో భర్త నదీముద్దీన్ ఆమెను భోపాల్ లో హతమార్చాడు.
హత్య చేసిన తర్వాత ఆమెను ఉరి వేసి చంపాడు. మే 21న ఈ ఘటన చోటు చేసుకుంది .
హత్య తదుపరి మృత దేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి డంప్ యార్డ్ వద్ద దగ్ధం చేశాడు.
ఈ సంగతిని నక్షత్ర పోలీసు స్టేషన్ ఎస్.ఐ ఎండీ అహిర్వర్ తెలిపారు. IPC 302 కింద హత్యా నేరం నదీముద్దీన్ పై కేసు నమోదు చేశామన్నారు.
Details
శర వేగంగా దర్యాప్తు
22 ఏళ్ల మృతురాలు తన తల్లితండ్రుల వద్ద మురళీ నగర్ లో నివసిస్తోంది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా వేరుగా వుంటోంది.
అయితే మే 21 నుంచి తమ కుమార్తె కనిపించటం లేదని మృతురాలి తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన భార్యను తానే హతమార్చానని నదీముద్దీన్ నక్షత్ర పోలీసు స్టేషన్ ఎస్.ఐ ముందు అంగీకరించాడు.
Details
నేర అంగీకారం వివరాలు
అదృశ్యమైన రోజు అంటే మే 21న మృతురాలిని నదీముద్దీన్ కరోన్డ్ జంక్షన్ లో కలుద్దామన్నాడు.
కలిసిన కాసేపటి తర్వాత మృతురాలిఫోన్ లో వున్న వీడియోను చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కోపంతో ఊగిపోయి ఆమెను ఉరి వేసి చంపేశాడు.
చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని 2 కిలో మీటర్ల దూరంలోని డంప్ యార్డ్ వద్ద కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.