LOADING...
Telangana: తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!
తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!

Telangana: తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆరు రాష్ట్రాలకు కలిపి రూ.1500 కోట్లకు పైగా నిధులు విడుదల చేయగా, అందులో తెలంగాణకు చెందిన పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్లు కేటాయించారు. ఈ నిధులను రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ గ్రాంట్లు ఉపయోగపడనున్నాయి.అయితే ఈ నిధుల వినియోగంపై కేంద్రం కఠిన నిబంధనలు విధించింది.

వివరాలు

అభివృద్ధి పనులకే ఈ నిధులు కేటాయించాలి

ఉద్యోగుల జీతాలు లేదా కార్యాలయ ఖర్చులకు కాకుండా కేవలం అభివృద్ధి పనులకే ఈ నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. గ్రామ సభ ఆమోదంతోనే ఈ గ్రాంట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. మురుగు కాల్వల మరమ్మత్తులు, రహదారుల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, శ్మశాన వాటికల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. గ్రాంట్ల విడుదలకు సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులు ఇప్పుడే విడుదలయ్యాయి.

వివరాలు

తన

ఈ మొత్తాన్ని కేంద్రం నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయనుంది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ప్రతి రూపాయికి ఆడిట్ తప్పనిసరి చేసింది. అలాగే గ్రామ పంచాయతీలు తమ అభివృద్ధి పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపడుతున్నారు. ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement