Supreme Court: సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం స్పందించారు. అతను ఏ టైమ్‌లో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయన్ను వదలడం లేదు.
ఈ వ్యాఖ్యల ప్రభావం ఇండియా కూటమిపై కూడా పడ్డాయి. అయితే ఈ వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
తాజాగా సుప్రీం కోర్టు ఉదయనిధి స్టాలిన్ కు షాక్ ఇఛ్చింది.
అతనితో సహా, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజాతో పాటు మరో 14 మందికి సుప్రీం కోర్టు సనాతన దర్శంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది.
Details
తమిళనాడు సర్కారుకు కూడా నోటీసులు
ఇక ఉదయ నిధి వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది.
దీనిపై విచారించిన ధర్మాసనం వీటిపై స్పందన తెలియజేయాంటూ ఉదయ నిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు శాఖ, సీబీఐ, ఏ రాజా తదితరులకు నోటీసులు జారీ చేసింది.
ఉదయ నిధి స్టాలిన్ ఈ నెల 2న సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పొల్చిన విషయం తెలిసిందే. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమని పేర్కొన్నారు.
దీంతో సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారి మనోభవాలను స్టాలిన్ వ్యాఖ్యలు దెబ్బతీశాయి.