Grandhi Srinivas : వైసీపీకి బిగ్ షాక్.. గ్రంధి శ్రీనివాస్ రాజీనామా
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఒకే రోజు రెండు పెద్ద షాకులు తగిలాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, పార్టీ పదవులను కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ రాజీనామాతో వైసీపీ శ్రేణులు అవాక్కయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి ముఖ్యమైన వ్యక్తిగా మారాడు. కానీ కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, వైసీపీ యాజమాన్యంతో గ్రంధి మధ్య అనేక విభేదాలు పెరిగాయి.
టీడీపీ, జనసేనలో చేరే అవకాశం!
వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా గ్రంథి హాజరు కాలేదు. దీంతో ఆయన వైసీపీని వీడే అవకాశం ఉందనే ప్రచారం అప్పట్లో జరిగింది. వైసీపీ అధిష్టానం గ్రంధిని దారి తప్పకుండా పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావును పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. 2024 నవంబరులో తన ప్రాపర్టీలపై ఐటీ దాడులు జరిగాక, వైసీపీని వీడే నిర్ణయం తీసుకున్నారు. ఇక గ్రంధి శ్రీనివాస్ టీడీపీ, జనసేనలో చేరతారా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.