
Haryana Police: హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య!
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలో ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ బలవన్మరణం ఘటన పెద్ద కలకలం సృష్టించింది. ఇదే క్రమంలో, తాజాగా మరో పోలీసు అధికారి తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారి తన సూసైడ్ నోట్‌లో పూరణ్ కుమార్‌పై ఆరోపణలు చేసినట్లు జాతీయ మీడియా ద్వారా సమాచారం వెలువడింది. పూరణ్ కుమార్ ఇటీవల చండీగఢ్‌లోని తన నివాసంలో రివాల్వర్‌ను ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ నోట్‌లో, కుల ఆధారిత వివక్ష, వేధింపులు,అవమానాలు కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారని వివరించారు. ఈ నోటులో ఎనిమిది మంది అధికారుల పేర్లను చేర్చారు.
వివరాలు
రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా బదిలీ
ఈ కేసుతో సంబంధం ఉన్న వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సెలవుపై పంపింది. అలాగే, రోహ్‌టక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను బదిలీ చేశారు. ఏఎస్సై సందీప్ కుమార్ రోహ్‌టక్ సైబర్ సెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పూరణ్ కుమార్‌పై ఉన్న ఒక అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఆ అధికారి తన సూసైడ్ నోట్‌లో పూరణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. నిజాలు బయటకు రావడానికి తన జీవితం త్యాగం చేస్తున్నట్లు పేర్కొన్నారు.