
Bihar : బిహార్ అసెంబ్లీని ముట్టడించిన అంగన్‌వాడీలు .. నీటి ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ముంగిట ఆ రాష్ట్ర అంగన్‌వాడీలు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏకంగా విధాన సభ ముందే నిరసనకు దిగారు.
వేలాది మంది మహిళలు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి, పోలీసులు అడ్డుతగిలారు. ఈ మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్‌లు (నీటి ఫిరంగులను) ప్రయోగించారు.
ఈ మేరకు ఓ అంగన్‌వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయారు. అయినప్పటికీ, పోలీసులు వాటర్ కానన్లను ప్రయోగించడం ఆపలేదు.
ఈ నేపథ్యంలోనే భారీగా తరలివచ్చిన మహిళా ఆందోళనకారులను, నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీహార్ అసెంబ్లీని ముట్టడించామని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిహార్ అసెంబ్లీని ముట్టడించిన అంగన్‌వాడీలు
#WATCH | Patna: Anganwadi workers 'gherao' Bihar Vidhan Sabha over their demands; police use water cannons to disperse the protestors. pic.twitter.com/FmMEtQpHu6
— ANI (@ANI) November 7, 2023