బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
ఇకపై జ్యుడీషియల్ సర్వీసులు, న్యాయ కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి(EWS) 10శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రాష్ట్రంలోని న్యాయ సంస్థలు, కళాశాలలు, న్యాయ విశ్వ విద్యాలయాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం 10శాతం రిజర్వేషన్ ని ఖరారు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ 1951 మార్గదర్శకాల సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Details
రాష్ట్రంలో 100వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణం
ఈ లెక్కన రాష్ట్రంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలు, న్యాయ సంస్థలు మొదలగు వాటిల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్ ఉండనుంది.
ఈ విషయమై మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని ఛీఫ్ సెక్రటరీ ఎస్ సిద్ధార్థ అన్నారు.
అంతేకాదు, బిహార్ రాష్ట్రంలో పశువైద్యాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు రాబోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 100వెటర్నరీ ఆసుపత్రిల నిర్ణాణానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని ఛీఫ్ సెక్రటరీ తెలియజేసారు.
మరికొద్ది రోజుల్లో 17జిల్లాల్లో వెటర్నరీ ఆస్పత్రుల నిర్మాణం జరగనున్నట్టు, అందుకోసం 225కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నటు ఛీఫ్ సెక్రటరీ సిద్ధార్థ్ తెలియజేసారు.