Page Loader
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు

Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నితీష్ కుమార్ అసెంబ్లీలో ఆర్జేడీపై మొదటి చర్యకు ఉపక్రమించారు. జేడీయూ-ఆర్జేడీ- కాంగ్రెస్ మహాకూటమి ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్‌గా అవధ్ బిహారీ చౌదరిని తొలగించాలని అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మహాకూటమిలో ప్రభుత్వంలో ఆర్జేడీకి చెందిన అవధ్ బిహారీ చౌదరి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. బీజేపీకి చెందిన నంద్ కిషోర్ యాదవ్, తార్కిషోర్ ప్రసాద్, హెచ్ఏఎం చీఫ్, మాజీ సీఎం రామ్ మాంఝీ, జేడీయూ నేతలు వినయ్ కుమార్ చౌదరి, రత్నేష్ సదాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు చౌదరిని తొలగించాలని కోరుతూ నోటీసు ఇచ్చారు.

బిహార్

నేడు తొలి కేబినెట్ సమావేశం

బిహార్‌లో కొత్త ఎన్డీయే ప్రభుత్వం సోమవారం తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. పాట్నలో ఉదయం 11:30గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు. అడ్వకేట్‌ జనరల్‌ నామినేషన్‌పై తొలి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చు. నితీష్ కుమార్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్, జేడీ(యూ) నేతలు విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజేంద్ర యాదవ్, హెచ్‌ఏఎం నేత సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్, సామ్రాట్ చౌదరి, సంతోష్ కుమార్ సుమన్ ఎమ్మెల్సీలు కావడం గమనార్హం.