Page Loader
Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను.. 
Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను..

Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను.. 

వ్రాసిన వారు Stalin
Dec 17, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పూజారిని దారుణంగా హత్య చేసారు. ఈ హత్యాకాండపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై ఆదివారం స్థానిక ప్రజలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఈ సమయంలో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసు వాహనానికి కూడా నిప్పు పెట్టారు. 32ఏళ్ల పూజారి మనోజ్ కుమార్ డిసెంబర్ 11 రాత్రి నుంచి కనిపించలేదు. ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీని తర్వాత పోలీసులు పూజారి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. డిసెంబర్ 16న గ్రామ సమీపంలోని పొదల్లో పూజారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతడిని ఎవరో హత్య చేసినట్లు గుర్తించారు.

హత్య

హత్య గురించి సంచలన విషయాలు చెప్పిన పోలీసులు

అదృశ్యమైన పూజారి మృతదేహాన్ని శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొదల్లోంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూజారిని కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అతడిని కాల్చి చంపిన తర్వాత హంతకులు అతని రెండు కళ్లను బయటకు తీశారు. అలాగే అతని ప్రైవేట్ భాగాలను కోసేశారు. ఈ మేరకు గాయాల గుర్తులు కూడా ఉన్నాయని పోలీసు అధికారులు వివరించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి-27పై నిరసన ప్రదర్శన సందర్భంగా ఆందోళనకారులు పోలీసులపై నిప్పుపెట్టారు. వారిపై రాళ్లు రువ్వారు, ఇందులో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.