
Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
లఖిసరాయ్‌లోని రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్ ప్రాంతంలోని ఝలౌనా గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది.
లఖిసరాయ్ సికంద్రా ప్రధాన రహదారిపై ట్రక్కు- ఆటో రిక్షా ఢీకొన్నాయి. దీంతో ఆటోరిక్షా బోల్తా పడింది.
ఆ సమయంలో ఆటోరిక్షాలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదుగురికి గాయాలు
Bihar News| लखीसराय में रफ्तार का कहर भीषण सड़क हादसे में ऑटो को अज्ञात वाहन ने मारी टक्कर,9 की मौत आधा दर्जन घायल
— Patna Live News Network (@live_patna) February 21, 2024
#BiharNews #lakhisarai
#roadaccidents @bihar_police@BiharHomeDept @LakhisaraiP @officecmbihar pic.twitter.com/AmfmhrDltc