Page Loader
Bittu Bajrangi: వ్యక్తిని కొడుతున్న బిట్టు బజరంగీ...చోద్యం చూస్తున్న పోలీసులు

Bittu Bajrangi: వ్యక్తిని కొడుతున్న బిట్టు బజరంగీ...చోద్యం చూస్తున్న పోలీసులు

వ్రాసిన వారు Stalin
Apr 03, 2024
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది హర్యానాలో నుహ్లో చెలరేగిన హింస కేసులో అరెస్టై బెయిల్ పై బయట తిరుగుతున్న బిట్టు బజరంగీ మరోసారి వార్తల్లో నిలిచాడు. గ్రామస్తులతో కలిసి ఒక వ్యక్తిని కర్రతో చితక్కొడుతున్న బిట్టు బజరంగీ వీడియో ఒకటి వైరల్ మారింది. ఈనెల 1 తేదీన ఫరీదాబాద్ లోని సరూర్పూర్ లో షాము అనే వ్యక్తి తన పొరుగున ఉన్న ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఇస్తానని ఆశజూపి ఇంటి లోపలికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే షాము ఇంటిలోకి వెళ్లి అతడిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. విషయం తెలిసిన బజరంగ్ దళ్, గోరక్ష బజరంగ్ దళం సభ్యులు కూడా అక్కడకు చేరుకుని అతడిని ఓ పెద్దనాయకుడి ఇంటికి తీసుకెళ్లారు.

Bittu Bajarangi

ప్రేక్షక పాత్ర వహించిన పోలీసు

అక్కడ షాముని బిట్టు బజరంగీ కర్రతో చితక్కొట్టాడు. షామును బిట్టు కొడుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉండి ఓ మూలన కూర్చుని ప్రేక్షక పాత్ర వహించారు. దీన్ని బజరంగ్ దళ్ సభ్యులెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటన పై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. షాము పై దాడిపట్లగానీ, బాలికలపై లైంగిక దాడిపట్ల గానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోతే వీడియో ఆధారంగా వ్యక్తులను ట్రేస్ చేసి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 పోలీసుల ముందే వ్యక్తిని కొడుతున్న బిట్టు