Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రకటించిన బీజేపీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 04, 2024
12:01 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం కాస్తా తొలగినట్లు కన్పిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (భాజపా) సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పేరు ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరును ప్రతిపాదించగా, అది ఏకగ్రీవంగా ఆమోదించబడ్డట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 5న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి