
Kuna Sriasailam Goud : కూన శ్రీశైలం మీద వివేకానంద దాడి.. పోలీసులకు ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ పరిధిలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ రసాభసాగా మారింది.
ఈ మేరకు బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద గౌడ్ బహిరంగంగా దాడి చేశాడు.
తాజాగా ఆ ఘటనపై కూన శ్రీశైలం గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
బుధవారం ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన గెలుపు ఎవరిది,లైవ్ డిబేట్ లో తాను ప్రజా సమస్యలు లేవనెత్తితే, కేపీ వివేకానంద్ గౌడ్ ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్నారు.
ఈ క్రమంలోనే తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, తనను దుర్భాషలాడారన్నారు.ఈ నేపథ్యంలోనే సూరారం పోలీస్ స్టేషన్ లో గత రాత్రి ఫిర్యాదు చేశారు.
details
కూన శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకున్న కేపీ వివేకానంద గౌడ్
ఇదే సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూన అభిమానులెవరూ సహనం కోల్పోవద్దని ఆయన సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు.
కుత్బుల్లాపూర్ లో జరిగిన డిబేట్లో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ మేరకు తాను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వ్యక్తినని కూన శ్రీశైలం గౌడ్ స్పష్టం చేస్తూ, వివేకానంద టీడీపీలో గెలిచి రూ. 10 కోట్లకు కేసీఆర్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు.
వివేకానందతో పాటు అతని తండ్రి అవినీతి పరులన్న కూన శ్రీశైలం గౌడ్ పై ఆయన దాడి చేస్తూ గొంతు పట్టుకున్నారు.
తేరుకున్న పార్టీ శ్రేణులు, ప్రజలు ఇరువురుని అడ్డుకోగా, పోలీసులు వివేకానందను పక్కకు లాక్కెళ్లారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ పై పోలీసులకు ఫిర్యాదు
ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? లైవ్ డిబేట్ లో నేను ప్రజా సమస్యలు లేవనెత్తితే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ గౌడ్ వాటికీ సమాధానం చెప్పకుండా, ఉద్దేశ పూర్వకంగా, నన్ను దుర్భాషలాడుతూ నాపై చేసిన భౌతిక దాడి గురించి సూరారం పోలీస్ స్టేషన్ లో… pic.twitter.com/V2t156377S
— Kuna Srisailam Goud (@KunaSrisailam) October 26, 2023