LOADING...
BJP: విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ భేటీ
విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ భేటీ

BJP: విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది పలువురు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులు, ముఖ్య పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు ఐదు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు కొత్త వర్గాలకు చేరువయ్యే వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళల్లో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను పార్టీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాకు వెల్లడించారు.

వివరాలు 

22రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది: సంబిత్ పాత్ర

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని,అదే సమయంలో బీజేపీ దేశవ్యాప్తంగా తన బలాన్ని మరింత విస్తరించుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని భాజపా-ఎన్‌డీయే ప్రభుత్వాలకు ప్రస్తుతం 22రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని సంబిత్ పాత్ర తెలిపారు. తాజా సమావేశంలో ప్రధానంగా పార్టీ విస్తరణ,సంస్థాగత బలోపేతం,రాబోయే ఎన్నికల సన్నాహకాలపైనే చర్చ జరిగినట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో గోవా,మణిపూర్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం నవంబర్-డిసెంబర్ నెలల్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఏడు రాష్ట్రాల్లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన ఐదు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో కొనసాగుతోంది.

Advertisement