West Bengal: మే 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం.. బీజేపీ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మే 9న, మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ తేదీకి సాంస్కృతిక, రాజకీయ ప్రాధాన్యత ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇదే విషయాన్ని ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుగానే సంకేతం ఇచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, టాగోర్ ఆలోచనలతో ముందుకు సాగుతామని తెలిపారు.
వివరాలు
మమతాను తాత్కాలిక సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరే అవకాశం
ఇక ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు కోల్‌కతాకు చేరుకుని అధికారిక గెజిట్ నోటిఫికేషన్ అందజేయనున్నారు. అనంతరం గవర్నర్ ఆర్.ఎన్. రవి, ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీను రాజీనామా చేయమని కోరనున్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరే అవకాశముంది. టాగోర్ జయంతి అయిన పోచిషే బోయిశాఖ రోజున ప్రమాణ స్వీకారం జరగడం బెంగాల్ ప్రజల్లో ప్రత్యేక భావోద్వేగాన్ని కలిగిస్తోంది. బెంగాల్ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.