Arunachal Pradesh: కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందస్తు అంనాల ప్రకారం , బీజేపీ బాగా ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి రానున్నారు. రాష్ట్రంలోని 60 స్థానాల్లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏకగ్రీవాలపై వివాదం అరుణాచల్ ప్రదేశ్‌లోని 50 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ఈరోజు భారీ భద్రత మధ్య ప్రారంభమైంది. అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది.దీనిపై కొంత వివాదం తలెత్తింది. ఖండూ, ఇతర అభ్యర్ధులు వైరి పక్షాలను ప్రలోభ పెట్టారని ఆరోపణలు వచ్చాయి. సూరత్ లోక్ సభ సీటులో ముఖేష్ దలాల్ అనే బీజేపీ అభ్యర్ధి పోటీ లేకుండా గెలిచిన సంగతి తెలిసిందే.
భారీ వర్షం నడుమ 50 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో 24జిల్లా కేంద్రాల్లో ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైందని,మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)పవన్ కుమార్ సైన్ తెలిపారు. ఖోన్సా తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి వంగ్లం సవిన్ తన సమీప బిజెపి అభ్యర్ధి బిజెపి అభ్యర్ధి కమ్రాంగ్ తెసియాపై 2,216 ఓట్ల తేడాతో గెలుపొందారని భారత ఎన్నికల సంఘం తెలిపింది.
50 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
ఈశాన్య రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. సావిన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు. ఆయనకు ఈసారి కాషాయ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి.