Page Loader
Atishi Marlena: నాతో సహా నలుగురిని అరెస్టు చేయాలని బీజేపీ చూస్తోంది: అతీషి
ఆప్​ లీడర్​ అతీషి

Atishi Marlena: నాతో సహా నలుగురిని అరెస్టు చేయాలని బీజేపీ చూస్తోంది: అతీషి

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతీషి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తనతో సహా నలుగురిని బీజేపీ అరెస్టు చేయాలని చూస్తోందని ఆప్ నాయకురాలు అతీషి ఆరోపించారు. అత్యంత సన్నిహితుల ద్వారా తనను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానం అందినట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ కెరీర్ ను కాపాడుకోవడం లేదా ఈడీ చేత అరెస్టు కావడం మాత్రమే తనకు మిగిలిందని బీజేపీ నేతలు చెప్పినట్లు ఆమె తెలిపారు. తనతోపాటు ఆప్​ నేతలు సౌరభ్​ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, రాఘవ్ చద్దాలను కూడా అరెస్టు చేసి రాజకీయాలలో ఆప్ ఉనికి లేకుండా చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్​ కుట్రలు చేస్తోందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

ఆప్ లీడర్​ అతీషి

బీజేపీ పునరాలోచన..

ఆదివారం రాంలీలా మైదాన్ లో జరిగిన భారీ ర్యాలీ తర్వాత నలుగురు ఆప్ నేతలను అరెస్టు చేసే అంశంపై బీజేపీ పునరాలోచించుకుంటుందన్నారు. రాబోయే రెండు నెలల్లో తమ నలుగురిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో ఆప్ ను అంతం చేయాలనుకునే బీజేపీ కుట్రలు నెరవేరవని ఆమె స్పష్టం చేశారు.