LK Advani: బీజేపీ అగ్రనేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 14, 2024
10:03 am
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ అగ్రనేత LK అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. రెండు నెలల క్రితం కూడా ఆయన రెండు రోజుల పాటు ఆస్పత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులకు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అద్వానీ అవిభక్త భారత్‌లోని కరాచీలో జన్మించారు. సుదీర్ఘకాలంతో పాటు బీజేపీలో పని చేసిన కురవృద్ధుడిగా ఆయన పేరు పొందారు.