LOADING...
Mamatha Benarjee: సర్‌' పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలించింది మమతా బెనర్జీ
సర్‌' పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలించింది మమతా బెనర్జీ

Mamatha Benarjee: సర్‌' పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలించింది మమతా బెనర్జీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. మొత్తం స్థానాల్లో గణన కొనసాగుతున్న సమయంలో, దాదాపు 190 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో నిలిచింది. ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో భాజపా ఓట్లను దొంగిలించిందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై వీడియో విడుదల చేసి తన అభిప్రాయాలను వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భాజపా ఓట్లను దొంగిలించింది: మమతా  

వివరాలు 

సీట్ల ఆధిక్యంపై తప్పుదారి పట్టించే వార్తలు వ్యాప్తి

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉన్న ఏజెంట్లు, అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి వెళ్లొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదంతా ముందుగానే సిద్ధం చేసిన పథకమని, మొదటి రెండు లేదా మూడు రౌండ్లలో భాజపానే ముందంజలో ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం జరుగుతుందని తాను ఇప్పటికే హెచ్చరించినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభ రౌండ్ల తర్వాత ఓట్ల లెక్కింపును నిలిపివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీని అణచివేయడానికి కేంద్ర బలగాలను ఒత్తిడి చేసి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. సీట్ల ఆధిక్యంపై తప్పుదారి పట్టించే వార్తలు వ్యాప్తి చేస్తున్నారని అన్నారు.

Advertisement

వివరాలు 

రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాల ఆధీనంలో పనిచేస్తున్నారు: మమతా 

ఎన్నికల నిర్వహణ సంస్థ కేంద్ర బలగాలతో కలిసి అనుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాల ఆధీనంలో పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఏజెంట్లు, కార్యకర్తలు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంకా అనేక రౌండ్లు మిగిలి ఉన్నాయని, తుది ఫలితాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మొత్తం స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా, భాజపా సుమారు 190 స్థానాల్లో ముందంజలో ఉంది. టీఎంసీ దాదాపు 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఒక స్థానంలో ముందుంది.

Advertisement