Rekha Patra Health: వెంటిలేటర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర.. విషప్రయోగం జరిగిందా?
ఈ వార్తాకథనం ఏంటి
2024లో పశ్చిమ బెంగాల్లో జరిగిన సందేశ్‌ఖాలీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రేఖా పాత్ర.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శనివారం అస్వస్థతకు గురైన రేఖా పాత్రను తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బసీర్హట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రేఖా పాత్ర అనారోగ్యానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు, బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
విషప్రయోగం జరిగిందా?
ఆదివారం ఉదయం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శరద్వత్ ముఖర్జీ ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బెంగాలీ మీడియా కథనాల ప్రకారం.. రేఖా పాత్రకు ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ITU)లో డాక్టర్ యుధాజిత్ సేన్‌గుప్తా పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె శరీరంలో విషప్రయోగానికి సంబంధించిన సంకేతాలు ఉన్నట్లు కొన్ని నివేదికలు వెలువడ్డాయి.
అయితే ఏ పదార్థం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది? అది ఆమె శరీరంలోకి ఎలా చేరింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
వివరాలు
సందేశ్‌ఖాలీ ఉద్యమంతో రాజకీయ గుర్తింపు
2024లో పశ్చిమ బెంగాల్లో జరిగిన సందేశ్‌ఖాలీ ఉద్యమంలో రేఖా పాత్ర కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు మహిళలపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ ఉద్యమం ద్వారా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆమెను బసీర్హట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపింది.
అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.