టీఎంసీ మహువా మోయిత్రా పై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అదానీ గ్రూప్ ను , ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి పార్లమెంటులో "ప్రశ్నలు అడగడానికి లంచం తీసుకున్నారని" ఆరోపిస్తూ, ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆదివారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. మహువా మొయిత్రాను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన కోరారు.
హీరానందానీ కోరిక మేరకు పార్లమెంట్ లో ఎంపీ ప్రశ్నలు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన రెండు పేజీల లేఖలో దూబే, "పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా, మొహువా మోయిత్రా,సౌగతా రాయ్ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం అలవాటు చేసుకున్నారన్నారు. 2019, 2023 మధ్య, ఎంపీ అడిగిన 61 ప్రశ్నలలో 50 దర్శన్ హీరానందానీ కోరిక మేరకు ఉన్నాయని దూబే ఆరోపించారు. పారాదీప్, ధమ్రా పోర్ట్ నుండి చమురు, గ్యాస్ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న స్టీల్ ధరలు,ఆదాయపు పన్ను శాఖ అధికారాలపై మొయిత్రా ప్రశ్నలు అడిగారు. ఎమ్మెల్యే మొయిత్రాపై విచారణ జరిగే వరకు ఆమెను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.