LOADING...
Uttar Pradesh: బీజేపీ ఎంపీ సోదరి స్నానం చేస్తుండగా వీడియో.. నిరసన తెలిపినందుకు అందరిముందే కర్రతో కొట్టిన మామ
నిరసన తెలిపినందుకు అందరిముందే కర్రతో కొట్టిన మామ

Uttar Pradesh: బీజేపీ ఎంపీ సోదరి స్నానం చేస్తుండగా వీడియో.. నిరసన తెలిపినందుకు అందరిముందే కర్రతో కొట్టిన మామ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు. అత్తింటి వారు చేసిన అకృత్యాలను బయటపెట్టినందుకు మహిళపై చిత్రహింసలు గురిచేస్తున్నారు. ఎలాగైనా వదిలించుకోవాలని.. ఆమెను, బజారులో అందరి ముందరే కర్రలు,లాఠీలతో కొడుతున్నారు. గత కొన్ని నెలలు ఈ ఘటన జరుగుతున్నా చుట్టుపక్కల వారు చోధ్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోకోకపోవడం గమనార్హం. వేధింపులు ఆగకుండా కొనసాగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

రీనా రాజ్‌పుత్‌పై అత్తింటివారు వేధింపులు 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లా చెందిన బీజేపీ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ సోదరి,రీనా రాజ్‌పుత్‌ 17 సంవత్సరాల క్రితం ఇటా జిల్లా రాణి అవంతిబాయి నగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ కూతురు ఉన్నది. అయితే గత కొంతకాలంగా రీనా రాజ్‌పుత్‌పై అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశ్యంతో వారు ఆమెను మరింత ఇబ్బందులకు గురిచేశారు. స్నానం చేస్తున్న సమయంలో ఆమె మామ, బావ కలిసి రహస్యంగా వీడియో తీసుకున్నారు. ఆమె వారిని ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నించగా, మామ ఆమెపై తుపాకీతో దాడి చేశారు. మామ నుంచి తప్పించుకోవాలన్న ఆమె యత్నంలో, బావమరిది వీధిలో ఇనుప రాడ్‌తో విచక్షణరహితంగా కొట్టారు.

వివరాలు 

లాఠీలు, కర్రలతో తరచూ కొడుతున్నారు:  బాధితురాలు 

దీంతో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తరచుగా లాఠీలు, కర్రలతో కొడుతున్నారు అని, తన కుమార్తెను కూడా హింసించారని, న్యాయం అందించాలని, భవిష్యత్తులో ఎలాంటి హానీ జరగకుండా చూడాలని అధికారులు వద్ద ఫిర్యాదు చేశారు. కాగా, బాధితురాలు అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.