Delhi BJP Manifesto: గర్భిణీలకు రూ.21వేలు.. 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో దిల్లీ బీజేపీ మేనిఫెస్టో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది.
'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే, గర్భిణీలకు రూ.21,000 ఆర్థిక సాయం, ఎల్‌పీజీ సిలిండర్లపై రూ.500 సబ్సిడీ ఇస్తామని వారు ప్రకటించారు.
'మహిళా సమృద్ధి యోజన' కింద, దిల్లీలోని మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
వీటితోపాటు, ప్రస్తుతం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీ మేనిఫెస్టో విడుదల
#BreakingNews: #BJP's 'Sankalp Patra' For #DelhiElections
— Mirror Now (@MirrorNow) January 17, 2025
BJP's manifesto for Viksit Delhi
BJP President, #JPNadda: Welfare schemes in Delhi to continue, Rs 21,000 for expecting mothers, Rs 500 subsidy on LPG cylinders, Rs 2,500 for women per month, free bus travel for women pic.twitter.com/tJPovSlixy