
మధ్యప్రదేశ్ బీజేపీ ఐదో జాబితా విస్పోటనమే..25-30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఐదో జాబితాని త్వరలోనే వెల్లడించనుంది.
ఈ మేరకు చివరి జాబితా విస్పోటనమేనని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా బుధవారం తెలిపారు.
ఇప్పటికే మధ్యప్రదేశ్ బీజేపీ 136 అసెంబ్లీ స్థానాేలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వం ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఐదో జాబితాలో మిగిలిన 94 మంది అభ్యర్థులను ఖరారు చేసే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
మరోవైపు హర్ లిస్ట్ ధమకేదర్ హీ హోగీ (ప్రతీ జాబితా దీపావళి లాంటిదే)నన్న మిశ్రా వ్యాఖ్యలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదో జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపనున్న బీజేపీ
Madhya Pradesh assembly elections
— narne kumar06 (@narne_kumar06) October 12, 2023
1️⃣According to sources, around 25 to 30 MLAs may not be renominated due to negative feedback.
2️⃣ the BJP is considering naming Scindia as a candidate in an upcoming assembly election from Yashodhara Scindia seathttps://t.co/c9p7Czd2cQ