LOADING...
Assam: అస్సాంలో రాజకీయ హీట్ పెంచిన బీజేపీ మేనిఫెస్టో
అస్సాంలో రాజకీయ హీట్ పెంచిన బీజేపీ మేనిఫెస్టో

Assam: అస్సాంలో రాజకీయ హీట్ పెంచిన బీజేపీ మేనిఫెస్టో

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక హామీలతో ముందుకొచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యువతకు భారీగా అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ముఖ్యంగా, తమను గెలిపిస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తామని స్పష్టం చేసింది. ఇక అక్రమ చొరబాట్ల అంశంపై కూడా బీజేపీ కఠిన వైఖరిని వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటిని అసలైన స్థానికులకు అందజేస్తామని హామీ ఇచ్చింది. అలాగే దేశ భద్రతకు భంగం కలిగించే అక్రమ చొరబాటుదారులను గుర్తించి, దేశ బహిష్కరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

వివరాలు 

మొత్తం 31 హామీలతో మేనిఫెస్టో

ఈ హామీలతో కూడిన 'సంకల్పపత్రం'ను కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman గువాహటిలో విడుదల చేశారు. మొత్తం 31 హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఇంకా, బీజేపీ మేనిఫెస్టోలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా మహిళలు, కార్మికులు, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హామీలు ఇచ్చింది.

వివరాలు 

మేనిఫెస్టోలోని ముఖ్య హామీలు

అరుణోదయ్ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ.1,250 నుంచి దశలవారీగా రూ.3,000 వరకు పెంచుతామని హామీ. గిరిజనులతో పాటు అర్హులైన తేయాకు తోట కార్మికులందరికీ భూ పట్టాలు ఇవ్వడం, అలాగే వారి వేతనాలను రూ.500 చొప్పున పెంచడం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుని, వారిని దేశం నుంచి బహిష్కరించడం. Uniform Civil Code (యూసీసీ) అమలుతో అస్సామీ ప్రజల సంస్కృతి, వారసత్వం, హక్కులను రక్షించడం. 'మిషన్ వసుంధర'లో భాగంగా చొరబాటుదారుల ఆక్రమణలో ఉన్న ప్రతి అంగుళం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, అసలైన అస్సామీ పౌరులకు భూ హక్కులు కల్పించడం.

Advertisement