LOADING...
Assembly Elections: బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీ మాస్టర్ ప్లాన్.. మహిళలకు రూ.3వేలు, యూసీసీ అమలు
బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీ మాస్టర్ ప్లాన్.. మహిళలకు రూ.3వేలు, యూసీసీ అమలు

Assembly Elections: బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీ మాస్టర్ ప్లాన్.. మహిళలకు రూ.3వేలు, యూసీసీ అమలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్‌ పత్ర' పేరుతో ఈ పత్రాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల పాలన పశ్చిమబెంగాల్‌కు పీడకలగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తున్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సమాజంలోని అన్ని వర్గాలను నిరాశ నుంచి బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు

మహిళలకు కొత్త అవకాశాలు కల్పిస్తాం

పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత, భద్రత కోసం ఆందోళన చెందుతున్న మహిళలకు కొత్త అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

వివరాలు

మ్యానిఫెస్టోలోని ప్రధాన హామీలు

గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు చొరబాటుదారులపై జీరో టోలరెన్స్ విధానం ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాల సృష్టి స్వయంఉపాధి అవకాశాల విస్తరణ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి మహిళలకు ప్రతి నెలా రూ.3,000 ఆర్థిక సహాయం మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

Advertisement