Page Loader
INDIA bloc: డిసెంబర్ 6న 'ఇండియా' కూటమి సమావేశం.. ఎన్నికల ఫలితాలపై చర్చ 

INDIA bloc: డిసెంబర్ 6న 'ఇండియా' కూటమి సమావేశం.. ఎన్నికల ఫలితాలపై చర్చ 

వ్రాసిన వారు Stalin
Dec 03, 2023
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు డిసెంబర్ 6న దిల్లీలో 'ఇండియా' కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా కూటమి భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సమీ ఫైనల్‌గా విశ్లేషకులు భావించారు. ఈ క్రమంలో ఇండియా కూటమికి ఈ సమావేశం చాలా ముఖ్యమైనది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పడింది.

embed

సమావేశంలో అసెంబ్లీ ఫలితాలపై చర్చ

STORY | INDIA bloc leaders to meet in Delhi on Dec 6 to chalk out strategy for Lok Sabha polls READ: https://t.co/X42C9D5eBv (PTI File Photo) pic.twitter.com/pkiSf0zLjS— Press Trust of India (@PTI_News) December 3, 2023