Page Loader
 LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'
LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'

 LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీ వెల్లడించారు. అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నట్లు పంచుకోవడం తనకు సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. తాను కూడా అద్వానీజీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరన్నారు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుంచి మన ఉప ప్రధానమంత్రిగా ఆయన దేశానికి ఎంతో సేవ చేసినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంంగా అద్వానీతో దిగిన రెండు ఫొటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ ట్వీట్