LOADING...
Krishna river: కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!
కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!

Krishna river: కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

రాత్రి వేళ, వెన్నెల కింద బోటులో విహరించాలనేది ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఇకదీ ఆ ఊహ కోసం కేరళకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ బోట్‌హౌస్‌లలో పర్యాటకులు బ్యాక్ వాటర్ ప్రయాణం అనుభవించవచ్చు, రాత్రిపూట బస కూడా ఆస్వాదించవచ్చు. కుటుంబమంతా కలిసి సమయం గడపడానికి, పార్టీలు చేసుకోవడానికి వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి బోట్‌హౌస్‌లో ఏసీ, టీవీ సహా అన్ని ఆధునిక సదుపాయాలు ఉంటాయి. పీపీపీ విధానంలో రూపొందించిన ఈ బోట్‌హౌస్‌లు మూడు రకాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల్లోనే విజయవాడ పున్నమిఘాట్ వద్ద సీఎం చంద్రబాబు వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు.

Advertisement