అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?
ఈ వార్తాకథనం ఏంటి
అసోం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ నివాసంలో పదేళ్ల బాలుడు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహం మెడకు గుడ్డ చుట్టి కనిపించిందని కాచర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) సుబ్రతా సేన్ వార్తా వెల్లడించారు.
బాలుడి తల్లి రెండున్నరేళ్లుగా బీజేపీ ఎంపీ ఇంట్లో పనిచేస్తోందని ఏఎస్పీ తెలిపారు. చనిపోయిన బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు.
అతని తల్లి, అక్కతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ఎంపీ ఇంట్లో ఉంటున్నాడు. తమ ఇంట్లో బాలుడు ఉరి వేసుకున్నట్లు తనకు సమాచారం అందినట్లు రాజ్‌దీప్ రాయ్ తెలిపారు.
వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారని ఎంపీ చెప్పారు. పోలీసు అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సిల్చార్ మెడికల్ కాలేజీకి తరలించారు.
అసోం
మొబైల్ ఇవ్వలేదన్న కోపంతోనే ఆత్మహత్య?
బాలుడి మృతి విషయంపై తాను సిల్చార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)తో మాట్లాడానని, ఈ విషయం ఆత్మహత్యగా భావిస్తున్నట్లు రాజ్‌దీప్ రాయ్ చెప్పారు. నిబంధనల ప్రకారం పోలీసు విచారణ జరుగుతుందన్నారు.
వీడియో గేమ్ ఆడేందుకు తన తల్లి మొబైల్ ఇవ్వలేదన్న కోపంతో అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాయన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్య లాగే కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.
బాలుడి తల్లి తన కుమార్తెతో కొన్ని కిరాణా సామాన్లు కొనడానికి వెళ్లిందని, అంతకు ముందు బాలుడు మొబైల్ అడగ్గా, అమె ఇవ్వలేదని ఎంపీ బిజెపి ఎంపీ రాయ్ తెలిపారు. ఆమె వచ్చే సరికి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.