Page Loader
Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం
సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం

Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్ రాష్ట్రం గత ఏడాదిన్నరగా మైతేయ్‌-కుకీ తెగల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. అటు హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ నివాసం వద్ద బాంబు కన్పించడం తీవ్ర కలకలం సృష్టించింది. కొయిరెంగేయ్‌ ప్రాంతంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ ప్రైవేట్ నివాసం ఉంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఓ మోర్టార్‌ బాంబు గుర్తించారు.

Details

బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు

స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. అయితే ఈ ఘటన సమయంలో సీఎం నివాసంలో లేరని సమాచారం అందింది. స్థానికులు, రాకెట్‌ ప్రొపెల్డ్‌ బాంబు గత రాత్రి ప్రయోగించనట్లుగా అనుమానిస్తున్నారు. పేలకుండా అక్కడ పడిపోయి ఉండొచ్చని వారు తెలిపారు. ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, బాంబు ఎక్కడి నుంచి వచ్చిందో, దానిని ప్రయోగించిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.