LOADING...
Bomb threat: ఎయిరిండియా విమానానికి బాంబు హెచ్చరిక.. రియాద్‌ విమానాశ్రయానికి మళ్లింపు
ఎయిరిండియా విమానానికి బాంబు హెచ్చరిక.. రియాద్‌ విమానాశ్రయానికి మళ్లింపు

Bomb threat: ఎయిరిండియా విమానానికి బాంబు హెచ్చరిక.. రియాద్‌ విమానాశ్రయానికి మళ్లింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా (Air India) విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో రియాద్‌ (Riyadh)కు దారి మళ్లించారు. రియాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన వెంటనే ప్రయాణికులను సురక్షితంగా బయటికి తరలించారు. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించగా, విమానంలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐఐ-114 నంబర్‌ గల ఎయిరిండియా విమానం శనివారం రాత్రి 8.26 గంటలకు బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీకి టేకాఫ్‌ అయ్యింది. కొద్ది సమయంలోనే విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపు కాల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Details

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విమానాన్ని రియాద్‌ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం రియాద్‌ (కింగ్‌ ఖాలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి) చేరుకున్న వెంటనే భద్రతా సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించి, విమానం మొత్తం జల్లెడపట్టారు. బాంబు లేదని తేలడంతో అందరూ ఉపశమనం చెందారు. ప్రయాణికులందరికీ రియాద్‌లోని ఒక హోటల్‌లో తాత్కాలిక వసతి కల్పించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి విమానం రియాద్‌లోని కింగ్‌ ఖాలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉంది.