
Mumbai Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు.
'ఆపరేషన్ సిందూర్' కింద భారత త్రివిధ దళాలు పాక్ ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల తరువాత ఇలాంటి బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అధికారుల వివరాల ప్రకారం, ముంబయి విమానాశ్రయానికి ఫోన్ ద్వారా ఓ అనామక కాల్ వచ్చింది.
అందులో చండీగఢ్ నుంచి వచ్చే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, సంబంధిత విమానాన్ని ముంబయి ఎయిర్‌పోర్టులో అత్యంత జాగ్రత్తగా దిగేలా చేశారు. భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి, విమానాన్ని తనిఖీ చేశాయి.
Details
భద్తా సూచనలు జారీ చేసిన ప్రభుత్వం
ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందిస్తూ, మారుతున్న వైమానిక భద్రతా పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
ప్రయాణికుల భద్రతే తమకు ప్రాముఖ్యమని పేర్కొంది. ఇక భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతంలోని కొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది.
ఇందులో జమ్మూ, శ్రీనగర్, లేహ్, ధర్మశాల, అమృత్‌సర్ విమానాశ్రయాలు ఉన్నాయి.
ఇవి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసే ఉండనున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణికులకు ప్రభుత్వం పలు భద్రతా సూచనలు జారీ చేసింది.