Bomb Threat: సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో వరుసగా బాంబు బెదిరింపు ఘటనలు కొనసాగుతుండటం కలకలం రేపుతోంది.
ఇటీవల వందలాది విమానాలకు వచ్చిన ఇలాంటి బెదిరింపులు తెలిసిందే.
తాజాగా దిల్లీకి వెళ్తున్న 12565 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు వచ్చింది.
శుక్రవారం సాయంత్రం బీహార్‌లోని దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వెళ్ళుతున్న ఈ రైల్ గురించి ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు సమాచారమందింది.
వెంటనే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమై గోండా రైల్వే జంక్షన్ వద్ద సాయంత్రం 7:30 గంటల సమయంలో రైలును ఆపారు.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో సమగ్రంగా తనిఖీలు చేపట్టగా, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు.
ఈ బెదిరింపు బూటకమని అధికారులు ప్రకటించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ప్రయాణికులు, రైల్వే అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.