తదుపరి వార్తా కథనం

Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 28, 2024
03:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ హోటల్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్‌లో హోటల్‌పై బాంబు పెట్టే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు.
ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు బెంగళూరు డీసీపీ శేఖర్ హెచ్‌టీ ధృవీకరించారు.
Details
భద్రతా చర్యలను పటిష్టం చేసిన పోలీసులు
వెంటనే హోటల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, సోదాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం బాంబు డిస్పోజల్ స్క్వాడ్, సిటీ పోలీసు బృందం హోటల్‌ను పూర్తిగా తనిఖీ చేస్తోంది.
ఈ హోటల్‌లో ప్రముఖ రాజకీయ నేతలు, క్రికెటర్లు తరచూ ఉంటారని, దీంతో భద్రతా చర్యలు మరింత పటిష్టంగా చేపట్టారని తెలుస్తోంది.
మీరు పూర్తి చేశారు