Page Loader
Bomb threat: మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు

Bomb threat: మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2025
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చిన ఘటన కలకలం రేపింది. దుండగులు ఓవర్‌సీస్ ఇమెయిల్ ద్వారా కలెక్టరేట్‌లో బాంబు ఉంచినట్లు హెచ్చరించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో కలిసి కలెక్టరేట్‌ పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే, ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.