Bomb threat: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. దర్యాప్తు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం, గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు.
ఈ ఘటనపై అధికారులు గోప్యత పాటించడంతో, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి విమానాశ్రయానికి సంబంధించిన సీఐఎస్ఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు, ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాంబు బెదిరింపుల విషయం బయటికొచ్చింది.
ఈ-మెయిల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Details
బాంబు బెదిరింపు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి భక్తులు, సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వస్తారు.
ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చే బెదిరింపుల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటూ, దర్యాప్తు బృందాలు నిందితులను గుర్తించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి.