Page Loader
#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్ 
#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్

#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్ 

వ్రాసిన వారు Stalin
Jan 07, 2024
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

#Boycott Maldives: మొన్నటి దాకా భారతీయ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, పర్యాటక ప్రేమికులు మాల్దీవ్స్ అందాలను వీక్షించేందుకు ఆసక్తి చూపేవారు. అయితే ఇప్పుడు పరిస్థతి మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్‌తో పాటు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాల్దీవుల నాయకుడు జాహిద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు పర్యాటకంగా ఆ దేశాన్ని భారతీయులు బహిష్కిరంచే పరిస్థితి వచ్చింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్ అవుతుంది? ఏం జరిగిందో తెలుసుకుందాం.

మాల్దీవులు

ప్రధాని మోదీ ట్వీట్‌పై మాల్దీవులు ఎంపీ అక్కసు

ఇటీవల ప్రధానమంత్రి మోదీ కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో పర్యటించారు. లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా మోదీ పలు సాహసాలు చేశారు. పర్యటన తర్వాత.. మోదీ లక్షద్వీప్‌లో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు కచ్చితంగా వారి లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు. మోదీ విజ్ఞప్తిపై మాల్దీవులు ఎంపీ జహీద్‌ రమీజ్‌ తన అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో తమతో ఎవరూ పోటీ పడలేరని.. లక్షద్వీప్‌‌లో ఎన్నో సమస్యలు ఉన్నట్లు రమీజ్‌ ట్వీట్ చేశారు. తమ దేశం పర్యాటకులకు మంచి సర్వీసులను అందిస్తుందని, కానీ, లక్షద్వీప్‌‌లో అది సాధ్యం కాదని, అక్కడి గదుల్లో వాసన వస్తుందని, అదే అక్కడి పెద్ద సమస్యగా చెప్పుకొచ్చారు.

మాల్దీవులు

రంగంలోకి దిగిన భారతీయ సెలబ్రిటీలు

జహీద్‌ రమీజ్‌ చేసిన కామెంట్లపై భారతీయులు, సెలబ్రిటీలు మండిపడుతున్నారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. #BoycottMaldives‌కు మద్దుతుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌కు భారతీయ సెలెబ్రిటీలు మద్దతుగా నిలచారు. మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే భారత్‍పై ఇలా మాట్లాడటం తగదని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అన్నారు. నటి శ్రద్ధా కపూర్ కూడా లక్షద్వీప్‌కు మద్దతుగా నిలిచింది. సెలవుల్లో తాను అక్కడికి వెళ్తానని ట్వీట్ చేసింది. క్రికెట్ గాడ్ సచిన్ అయితే.. లక్షద్వీప్ బీచ్ వద్ద అతను క్రికెట్ ఆడుతున్న వీడియోని చేశారు. సల్మాన్ ఖాన్ కూడా #BoycottMaldives‌కు మద్దతుగా స్పందించాడు. లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 లక్షద్వీప్ బీచ్‌లో క్రికెట్ ఆడుతున్న సచిన్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సల్మాన్ ఖాన్ ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అక్షయ్ కుమార్ ట్వీట్