Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తిచేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
Details
యాదాద్రి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు
మార్చి 1 : మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేన ఆళ్వార్లకు తొలిపూజ నిర్వహించి, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుపుతారు.
మార్చి 2 : ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం
మార్చి 3 : ఉదయం మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణాలు, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ
మార్చి 4 : ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
మార్చి 5 : శ్రీ కృష్ణాలంకార సేవ నిర్వహించి, రాత్రి పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు.
మార్చి 7 : రాత్రి ఎదుర్కోలు వేడుక
మార్చి 8 : రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం
మార్చి 9 : రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరుగుతుంది.
మార్చి 11 : గర్భాలయంలోని మూలవరులకు సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Details
కొన్ని సేవలను రద్దు చేసిన అధికారులు
వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయ అధికారులు కొన్ని సేవలను రద్దు చేశారు. ఇందులో కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవలు రద్దయ్యాయి.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవలే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో ఈ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు.
వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాదిక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు.