LOADING...
పంజాబ్: లుథియానాలో గ్యాస్ లీక్; 9మంది మృతి

పంజాబ్: లుథియానాలో గ్యాస్ లీక్; 9మంది మృతి

వ్రాసిన వారు Stalin
Apr 30, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లుథియానా జిల్లాలోని గియాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో కనీసం 9మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. మరో పదకొండు మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. స్పృహ కోల్పోయిన వారిని ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దింపారు. గ్యాస్ లీక్‌ను లూథియానా వెస్ట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్వాతి ధృవీకరించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం ప్రస్తుతం బాధిత వ్యక్తులను తరలించడానికి, అవసరమైన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లుథియానాలో ఘోర ప్రమాదం