Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రాంతీయ అంశాలు, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరైన విదేశాంగ మంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక్కొక్కరుగా వేదికపైకి చేరుకుని ప్రధానితో కరచాలనం చేశారు. అనంతరం అందరు కలిసి ప్రధానితో గ్రూప్ ఫొటో దిగారు. విదేశాంగ మంత్రులతో ప్రధానమంత్రి సమావేశమైన దృశ్యాలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.
వివరాలు
సెర్గీ లావ్రోవ్‌తో సంవాసం కానున్న జైశంకర్
బ్రిక్స్ సమావేశాలకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్ పలువురు దేశాల ప్రతినిధులతో ప్రత్యేక ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఉదయం చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నాతో సమావేశమై రెండు దేశాల సంబంధాలపై చర్చించారు. అనంతరం దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సాయంత్రం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కూడా జైశంకర్ సమావేశం కానున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధానితో విదేశాంగ మంత్రులు కలిసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు
#WATCH | Prime Minister Narendra Modi meets with BRICS Foreign Ministers, in Delhi.
— ANI (@ANI) May 14, 2026
India is hosting the BRICS Foreign Ministers' Meeting on 14–15 May 2026. pic.twitter.com/cTjUmKrpAb