Loading...
BRICS Parliamentary Forum: నేడు ఢిల్లీ వేదికగా బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు.. హాజరుకానున్న మోదీ
నేడు ఢిల్లీ వేదికగా బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు..హాజరుకానున్న మోదీ

BRICS Parliamentary Forum: నేడు ఢిల్లీ వేదికగా బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు.. హాజరుకానున్న మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు నేడు దేశ రాజధాని దిల్లీలో ప్రారంభం కానుంది. 'ప్రజా కేంద్రీకృత అభివృద్ధి కోసం పార్లమెంట్లను బలోపేతం చేయడం' అనే నినాదంతో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు వివిధ దేశాల పార్లమెంటరీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాల నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందాలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు.

వివరాలు 

రష్యా ప్రతినిధితో ఓం బిర్లా భేటీ

సదస్సు ప్రారంభానికి ముందే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక సమావేశాలు నిర్వహించారు.

ఆదివారం రష్యా పార్లమెంటు దిగువ సభ అయిన డూమా చైర్మన్ వ్యాచెస్లావ్ వోలోడిన్‌తో ఆయన భేటీ అయ్యారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్, రష్యా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా కృషి చేయడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు రష్యా అందిస్తున్న మద్దతును ఓం బిర్లా ఈ సందర్భంగా ప్రశంసించారు.

వివరాలు 

భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు కోరిన బిర్లా

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశంలో రష్యా తన సహకారాన్ని కొనసాగించాలని ఓం బిర్లా కోరారు.

భారత్, రష్యా మధ్య దౌత్య సంబంధాలు వచ్చే ఏడాదికి 80 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

ముఖ్యంగా అణుశక్తి, పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై చర్చించారు.

అనంతరం ఓం బిర్లా ఈజిప్ట్, క్యూబా, బెలారస్ దేశాల ప్రతినిధి బృందాలతోనూ వరుసగా సమావేశమయ్యారు.

ADVERTISEMENT