
Karan Bhushan Singh: బ్రిజ్ భూషన్ కుమారుడి వాహనం ఢీ: ఇద్దరిమృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండాలోబ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ భూషన్ సింగ్ కాన్వాయ్ రోడ్డు ఇవాళ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో మహిళ గాయపడింది.
కరణ్.. కైసర్ గంజ్ నుంచి BJP తరపున పోటీ చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ గా ఉన్నప్పుడు బ్రిజ్ భూషన్ పై ఆరోపణలు వచ్చాయి.
మహిళలను లైంగికంగా వేధించాడని,బెదిరించాడని పలువురు ఆరోపించారు.
దీంతో BJP కైసర్ గంజ్ నుంచి ఆయన కుమారుడు కరణ్ భూషన్ సింగ్ కు టికెట్ కేటాయించింది.
కాగా ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లవకుశను అదుపులోకి తీసుకున్నట్లు కేర్నాల్ గంజ్ ఇన్ స్పెక్టర్ నిర్భయ్ నారాయణ్ సింగ్ తెలిపారు.
Details
వాహనం ఢీకొనగానే యువకులు మృతి
బైక్ పై వస్తున్న యువకులను కరణ్ వాహనం ఢీకొనగానే అక్కడిక్కడే చనిపోయారు.
కాగా మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరగగానే వాహనంలోని వారు పరారయ్యారు. దీనితో స్ధానికుల్లో తీవ్ర ఆగ్రహం తలెత్తింది. అయితే ప్రస్తుతం పరిస్ధితి అదుపులో వుందని పోలీసులు తెలిపారు.