Page Loader
BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన 
BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన

BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన 

వ్రాసిన వారు Stalin
Mar 05, 2024
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నందినగర్‌లోని బీఆర్‌ఎస్‌ అధినేత నివాసంలో ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్-బీఎస్పీ పోత్తుపై ఇరు పార్టీల అధ్యక్షులు సంయుక్త ప్రకటన చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆమోదం పొందిన తర్వాత ప్రవీణ్ కుమార్ పొత్తు ప్రతిపాదనతో తనను సంప్రదించారని కేసీఆర్ పేర్కొన్నారు. పొత్తు పెట్టుకునేందుకు తాము సూత్రప్రాయంగా అవగాహనకు వచ్చామని ఆయన చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న కేసీఆర్

కేసీఆర్

కాంగ్రెస్, బీజేపీ నుంచి తెలంగాణను కాపాడేందుకే ఈ పొత్తు: ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్, బీఎస్పీ రెండు కూడా సిద్ధాంతాల పరంగా సారుప్యత ఉన్న పార్టీలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో దళిత బంధు, రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలలు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. మాయవతితో మాట్లాడిన తర్వాత సీట్ల పంపకం, ఇతర సమస్యలకు సంబంధించిన విషయాలపై తాము చర్చిస్తామని స్పష్టం చేశారు. దేశంలోని సెక్యులర్ ఫ్యాబ్రిక్‌ను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన నిబంధనలను కూడా తోసిపుచ్చేందుకు కుట్ర చేస్తోందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి తెలంగాణను కాపాడటానికి తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.