తెలంగాణలో మళ్ళీ మొదలైన పోస్టర్ల గొడవ, ఈసారి బీఎల్ సంతోష్ పై బీఆర్ఎస్ గురి
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఈరోజు మళ్ళీ ఈడీ ముందు హాజరు అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బీపేజీ పై పోస్టర్ల తో గురి పెట్టింది బీఆర్ఎస్. తాజాగా బీజేపీ జాతీయ సెక్రటరీ బీఎల్ సంతోష్ ను గురించి పోస్టర్లను అంటించింది. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్థుడైన సంతోష్, కనబడుటలేదని, కనిపెట్టిన వారికి మోడీ చేత 15లక్షల బహుమానం ఉంటుందని ఆ పోస్టర్ లో ఉంది. గతవారం, రైడ్ డిటర్జెంట్స్ పేరుతో జ్యోతిరాదిత్యా సింథియా, అస్సాం ఛీఫ్ బిస్వ శర్మ ల ఫోటోలను చూపుతూ, కాంగ్రెస్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు, ఆ తర్వాత బీజేపీలో చేరగానే అవినీతి మరకలు మాయమయ్యాయి అన్నట్టు పోస్టర్లు వేసారు.
బీఎల్ సంతోష్ కనబడటం లేదని హైదరాబాద్ లో పోస్టర్లు
ఈడీ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్ళిన కవిత
ఈ పోస్టర్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈడీ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత. అయితే మార్చ్ 24వ తేదీన, తన వాదనలు వింటామని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. మార్చ్ 11వ తేదీన ఈడీ ముందు హాజరైంది కవిత. ఆరోజు దాదాపు 9గంటల పాటు కవితను విచారించారు. మద్యం కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిన హైదరాబాద్ కి చెందిన అరుణ్ రామ్ చంద్రన్ పిళ్ళై ఇచ్చిన సమాధానాల ప్రకారం, కవితను విచారిస్తున్నారు. అరుణ్ రామ చంద్రన్ పిళ్ళై తో పాటుగా మరికొంతమంది కూడా ఈ కేసులో ఉన్నారు. ఈరోజు ఈడీ ముందు మరోసారి హాజరవుతుంది కవిత.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి