Page Loader
Kcr : రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ రెడి.. షెడ్యూల్ ఇదే
రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ రెఢీ.. షెడ్యూల్ ఇదే

Kcr : రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ రెడి.. షెడ్యూల్ ఇదే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 13, 2023
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారానికి రెడి అయ్యారు. 3 రోజుల షార్ట్ బ్రేక్ అనంతరం సోమవారం నుంచి ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాలను చుట్టేశారు. ఈ మేరకు గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. తాము చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల వైఖరిని ఎండగట్టనున్నారు. నవంబర్ 9న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అక్కడే సభ నిర్వహించి తొలి విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా రెండో షెడ్యూల్ లో రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొననున్నారు. 16 రోజుల పాటు సాగనున్న ప్రచార పర్వంలో 54 సభల్లో పాల్గొననున్నారు.

details

భద్రాద్రి జిల్లాతో ప్రారంభం కానున్న రెండో విడత ప్రచారం 

ఈ నెల 13న సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ( భద్రాచలం, పినపాక కలిపి ఒకే సభ). 14న పాలకుర్తి, నాగార్జునసాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నంలో ప్రచారం 15న బోధన్, నిజమాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ సభలకు హాజరు. 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ సభల్లో ప్రసంగం 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల సభల్లో ప్రచారం చేయనున్నారు. 18న చేర్యాల (జనగాం)లో రోడ్ షో నిర్వహించనున్నారు. 19న ఆలంపూర్, కల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభలకు హాజరు. 20న మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్, నకిరేకల్, నల్లగొండలో ప్రచార పర్వం

details

24న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో కేసీఆర్ సభ

21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో ప్రచారం చేయనున్నారు. 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగిలో ఎన్నికల ప్రచారం. 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరువులో ప్రసంగం 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో అభ్యర్థులగా మద్ధతుగా ప్రచారం. 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో ప్రచారం 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి సభలకు హాజరు 28న వరంగల్(ఈస్ట్+వెస్ట్), గజ్వేల్‌ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.